Dhan Prapti Puja

మనోవాంఛాఫలసిద్ధి అష్టలక్ష్మీ పూజ

మన ప్రాపంచిక జీవితంలో మహాలక్ష్మీ దేవి యొక్క కటాక్షం ఎంతో ప్రధానం. మహాలక్ష్మీ దేవి యొక్క కరుణ కటాక్షాల వలన మనకు ఐశ్వర్యం మరియు మన కుటుంబానికి శాంతి, ఉత్సాహం మరియు ఆనందం ప్రాప్తిస్తాయి. మహాలక్ష్మీ దేవిని శ్రద్ధగా భక్తిభావంతో ఆరాధిస్తే మనకు అమ్మ దయ వలన ఆనందకరమైన మరియు శుభకరమైన జీవితం ప్రాప్తిస్తుంది.

మహాలక్ష్మీ దేవి, “అష్టలక్ష్మి”గా పేరు గాంచిన ఎనిమిది రూపాలలో వ్యక్తమయ్యింది. లక్ష్మీదేవిని భక్తితో, ఈ ఎనిమిది రూపాలలో ఆరాధిస్తే భక్తులకు మరియు వారి కుటుంబాలకు సంతోషం, శాంతి మరియు సంపదలను ప్రసాదిస్తుంది.

“అష్టలక్ష్మి” యొక్క ఎనిమిది/అష్ట రూపాలు ఈ విధంగా ఉన్నాయి:

1. ధనలక్ష్మి: లక్ష్మీ దేవి యొక్క ఈ రూపం భక్తునికి ఐశ్వర్యం మరియు సమృద్ధి ప్రసాదిస్తుంది. ఈ రూపమే వైభవలక్ష్మిగా కూడా పిలవబడుతుంది.

2. సంతానలక్ష్మి: సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం మనకు అరోగ్యకరమైన మరియు తేజస్సుగల సంతతిని ప్రసాదిస్తుంది. అలాగే, సంతానలక్ష్మి అమ్మ యొక్క కృప వలన ప్రస్తుతం మనకు ఉన్న సంతానం కూడా ఆరోగ్యంగా మరియు ఉన్నతంగా ఎదుగుతారు.

3. ధైర్యలక్ష్మి: జీవితంలో విజయం సాధించడానికి సహనం చాలా ముఖ్యమైన లక్షణం. కేవలం గొప్ప ఓర్పు వలన జీవితంలో ఒక మనిషి, అతి కఠినమైన పరిస్థితులలో కూడా విజయం సాధిస్తాడు. అష్టలక్ష్మి యొక్క కటాక్షం కఠినమైన పరిస్థితులలో విజయం సాధించడానికి మనకు సహనం ప్రసాదిస్తుంది.

4. గజలక్ష్మి: గజం/ఏనుగు ఒక ఘనమైన తేజస్సుకు చిహ్నం. ఈ గజలక్ష్మి రూపంలో కనిపిస్తున్న శ్వేత గజము ఇంద్రదేవునికి సంబంధించినది. గజలక్ష్మిని ఆరాధిస్తే భక్తుని యొక్క జీవితంలో ఒక ఘనమైన తేజస్సును ప్రసాదిస్తుంది.

5. విద్యాలక్ష్మి: విద్యాలక్ష్మి యొక్క అశీర్వచనములు మన విద్యా అర్హతను ఒక లాభదాయక వృత్తిగా రూపాంతరం చేస్తుంది, మరియు మన ప్రజ్ఞను సంపదగా మార్చుతుంది. విద్యాలక్ష్మి ఆరాధన మన వృత్తిపరమైన జీవితంలో అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.

6. విజయలక్ష్మి: మనం జీవితంలో యే క్షేత్రంలో పని చేసినా అందులో విజయం సాధించడానికి విజయలక్ష్మిని ఆరాధించి ఆశీర్వచనాలు తీసుకోవాలి. అప్పుడు అమితమైన విజయం లభిస్తుంది.

7. ధాన్యలక్ష్మి: ధాన్యలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే అక్షయపాత్ర యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఈ అక్షయపాత్ర ఆశీస్సులు వలన మన కుటుంబానికి ఎల్లప్పుడూ ఆహార ధాన్యాలు మరియు జీవనం సాగించడానికి అవసరమైన ఇతర సామగ్రి లభిస్తాయి.

అక్షయపాత్ర – అనగా “ఎప్పుడూ రిక్తము కాని ఒక దైవసంబంధమైన వాహిక”. అంటే “ఆహార ధాన్యములు మరియు జీవనం సాగించడానికి అవసరమైన ఇతర సామగ్రి.

8. ఆదిలక్ష్మి: బ్రహ్మాండ పురాణం ప్రకారం, సృష్టి-స్థితి-లయకారకులు అయిన బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులను ఆదిలక్ష్మి అమ్మ సృష్టించింది. ఆదిలక్ష్మి అమ్మవారిని సేవిస్తే అందరు దేవీ దేవతల యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి.

అష్టలక్ష్మి పూజ యొక్క ఇతర ప్రయోజనములు:

1. యే వివాహ సంబంధిత విభేదమైనా పరిష్కృతం అవుతుంది
2. వివాహం ఆలస్యం అవ్వడానికి గల కారణాలు పరిష్కృతం అవుతాయి
3. మీ ఇతర కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూరితం అవుతాయి

ప్రాపంచిక జీవితంలో, తన మరియు తన కుటుంబం యొక్క అభివృద్ధి కోసం ప్రతీ మనిషీ చాలా కష్టపడతాడు. జీవితంలో ప్రగతి సాధించడానికి కఠోర పరిశ్రమ చాలా ప్రధాన అంశము, కాని లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎవరికి అయితే లభిస్తాయో, వారికి సంతోషకరమైన శ్రేయస్సుతో కూడిన వేగవంతమైన అభివృద్ధి పొందుతారు.

ప్రాపంచిక జీవితంలో, తన మరియు తన కుటుంబం యొక్క అభివృద్ధి కోసం ప్రతీ మనిషీ చాలా కష్టపడతాడు. జీవితంలో ప్రగతి సాధించడానికి కఠోర పరిశ్రమ చాలా ప్రధాన అంశము, కాని, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎవరికి అయితే లభిస్తాయో, వారు సంతోషకరమైన శ్రేయస్సుతో కూడిన వేగవంతమైన అభివృద్ధి పొందుతారు.

కావున, మనమందరికీ మనోవాంఛాఫలసిద్ధి అష్టలక్ష్మీ పూజ జరిపించుకోవడం చాలా ప్రధానం.

ప్రసాదం ప్యాకేజీ :

లామినేటెడ్ కలర్ అష్టలక్ష్మి ఫోటో

ప్రసాదం హల్దీ – కుంకుమ

మిశ్రీ ప్రసాదం

వస్త్ర ప్రసాదం – Semi Paithani Saree
(ఈ చీర పవిత్రత, ఐశ్వర్యం మరియు దైవిక ఆశీర్వాదానికి ప్రతీక)